అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో మాట నిలబెట్టుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Official: Here is the Minute to Minute program schedule of YS Jagan for Tomorrow's Cabinet meeting

 

తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు.

ఈ మేరకు రూ.265 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలిసింది.హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయంతో అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు