ఏపీ హోంమంత్రి సుచరిత ట్వీట్:దిశ ఎన్‌కౌంటర్

హైదరాబాద్ శివారులో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి దగ్గర నలుగుర్ని కాల్చి చంపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా‌లో స్పందిస్తున్నారు.. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్‌లో స్పందించారు.

‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. 

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ 

అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావించారు. ‘సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం.. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను’అంటూ శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పారు. పాపాలు పెరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు.. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో దేవుడు అవతరిస్తాడు అంటారు.