సాహో సజ్జనార్‌… శభాష్‌ సజ్జనార్‌…..సెల్యూట్ సజ్జనార్‌

Sajjanar|police commissioner sajjanar

Justice for disha

దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై ఆనందం వ్యక్తం చేస్తోంది. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటు సంతోషం తెలుపుతున్నారు. అలాగే పలు కళాశాలల్లో విద్యార్థినులు .. మా ఆడపిల్లకు న్యాయం జరిగిందంటూ నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు.పోలీసులను ప్రశంసిస్తూ పూల వర్షం కురిపించారు.మరోవైపు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాహో సజ్జనార్‌… శభాష్‌ సజ్జనార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేళ్ల క్రితం వరంగల్‌లో యాసిడ్‌ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి చేసిన నిందితులను పోలీసులు ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అప్పుడు వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.