మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా, ఏపిలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి.లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రకటించింది.

అక్రమ కేసులు పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్‌ జగన్‌

మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.ఏపీ, తెలంగాణలోనూ తొలివిడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 18 న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.

ఏప్రిల్, మే నెలల్లోనే ప్రక్రియ మొత్తం ముగిసేలా 7 దశల్లో ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు.లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్లకు ఆఖరి తేది మార్చి 25 అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్‌ అరోరా వెల్లడించారు.
నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 ఆఖరి తేదీ అని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని అన్నారు. షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.