‘#RRR’ లో ముగ్గురు హీరోలట!

3 Heroes in RRRదర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’,ఈ సినిమాలో కథానాయకులుగా ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది.

‘#RRR’ హీరోలకు మాటిచ్చిన రాజమౌళి!

‘#RRR’ లో ఒక ముఖ్యమైన క్యామియోను చేసేందుకు ప్రభాస్ ను తీసుకొనే ఆలోచనలో జక్కన్న ఉన్నాడట.ఈ పాత్ర గురించి ఇప్పటికే ప్రభాస్ తో చర్చలు కూడా జరుగుతున్నాయట.

ఒకవేళ ప్రభాస్ ఓకే చేస్తే ఒకే తెరపై ముగ్గురు హీరోలను చూడొచ్చన్న మాట.అటు నందమూరి అభిమానులు,మెగా అభిమానులు,డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే ఉండదేమో.

ప్రస్తుతానికి జక్కన్న రెండో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.ఈ షెడ్యూల్ పూర్తవగానే కథానాయికలను ఎంపిక చేస్తాడట.మూడో షెడ్యూల్ మొదలయ్యేసరికి కథానాయికల వివరాలు వెల్లడిస్తారట.

Advertisement