‘జర్సీ’ లో స్పెషల్ సాంగ్ కోసం హార్ట్ అటాక్ బ్యూటీ

గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘జర్సీ’.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుండటం తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వినాయక్ కి ఓకే చెప్పిన వెంకీ

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ కోసం హార్ట్ అటాక్ బ్యూటీ అదా శర్మను దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అదా శర్మ స్పెషల్ సాంగ్ జర్సీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement