ఆదినారాయణ రెడ్డిని బాబు భలే ఇరికిచ్చాడులే!

Minister Adinarayana Reddy Campaign2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున అది నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి,ఆ తరువాత చంద్రబాబు తాయిలాలకు అమ్ముడుపోయి,టీడీపీ పార్టీలోకి ఫిరాయించాడు.అంతేకాదు ఏకంగా మంత్రి పదివిలో కూర్చున్నాడు.

‘అన్న వస్తున్నాడు’ అంటూ జనంలోకి జగన్!

ఈ ముచ్చట ఎన్నో రోజులు లేదులేండి,ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు లాక్కోవడం బాబుకు అలవాటే కదా!.అనూహ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో,బాబు రచించిన రాజీ ఫార్ములాతో ఇప్పుడు ఆది ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.

రానున్న ఎన్నికల్లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి, ఆదిని పోటీలో దించేందుకు బాబు అన్నీ రకాలుగా సిద్ధం చేశాడట.ఇక ఆది నారాయణ రెడ్డి కూడా చేసేదేమి లేక ఒప్పుకున్నాడట.

నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్లమెంటు బరికి శ్రీకారం చుట్టకముందు, ఒకే ఒక్కసారి టీడీపీ అక్కడ విజయం సాధించింది.అప్పటి నుంచి అక్కడ వైఎస్ ఫ్యామిలీనే గెలుస్తూ వస్తోంది.

ఇలా గెలవని చోట చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డిని బాగా ఇరికిచ్చారని,పార్టీని ఫిరాయించినందుకు తగిన శాస్త్రి జరిగిందని ఆయన సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారట.

Advertisement