అజ్ఞాతవాసి మూవీ తెలుగు రివ్యూ : ఈ త్రివిక్రమ్ కు ఏమైంది?

అజ్ఞాతవాసి మూవీ తెలుగు రివ్యూ (2.5/5.0) Agnyaathavaasi Review In English

Agnyaathavaasi Movie Review

అజ్ఞాతవాసి మూవీ తెలుగు రివ్యూ | అజ్ఞాతవాసి మూవీ రివ్యూ  | అజ్ఞాతవాసి మూవీ విశ్లేషణ | అజ్ఞాతవాసి | అజ్ఞాతవాసి తెలుగు మూవీ రివ్యూ | పవన్ కళ్యాణ్ | త్రివిక్రమ్ 

పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడో సారి చేసిన అజ్ఞాతవాసి ఎట్టకేలకు సంక్రాంతి సందడి ని స్టార్ట్ చేస్తూ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రవాస భారతం లో ప్రదర్శితమైంది. ఆకాశమే హద్దుగా క్రేజ్ సంపాదించున్న ఈ చిత్రం అదే స్థాయి లో వుందో లేదో చూద్దాం పదండి.

కథ : బాగా డబ్బులున్న ఒక పెద్దాయన విందా (బొమ్మన్ ఇరానీ),అతని భార్య (కుష్బూ) ఒక ప్రాజెక్ట్ అవసరార్ధం చిక్కుల్లో ఇరుక్కుంటారు. శత్రువులు చేసిన ఆక్సిడెంట్ లో విందా మరియు అతని కుమారుడు చనిపోతారు. 

విందా ఇంకో కుమారుడైన అభిషిక్త భార్గవ లేదా ఏ బి., తన కంపెనీ లోనే అజ్ఞాతం గా వుంటూ , ఎలా సమస్యల్ని ఎదుర్కున్నాడు., శత్రువుల గురించి ఏం తెలుసుకున్నాడు ., ఆ తెలుసుకొనే విధానం లో కొత్త బంధాల్ని ఎలా కలుపుకున్నాడో తెలిపే కథ అజ్ఞాతవాసి.

అభిషిక్త భార్గవ విందా కొడుకని తెలీకుండా అజ్ఞాతం లో ఎందుకుంటాడు ? అవసరమైనప్పుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు ? అనే వాటికీ సినిమా చూస్తేనే బావుంటుందేమో..!

అజ్ఞాతవాసి మూవీ తెలుగు రివ్యూ (2.5/5.0) Agnyaathavaasi Review In English

విశ్లేషణ : డైరెక్టర్ త్రివిక్రమ్ చిన్నప్పుడు బాగా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడో., లేక బాగా డబ్బులున్న రాకుమారుడి జీవితం అనుభవించాలనుకున్నాడో కానీ ., అతని స్టోరీ లన్నిగత కొన్ని సినిమాలనుంచి ఆ డబ్బు చుట్టూ నే తిరుగుతున్నాయి. అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్,సన్ అఫ్ సత్యమూర్తి లో అల్లు అర్జున్,అ ఆ లో సమంత అందరు డబ్బులో మునిగి తేలే వాళ్ళే. కోతి కి కొబ్బరి చిప్ప దొరికినట్లు , త్రివిక్రమ్ పిచ్చి కి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి సంస్థ దొరికింది .ఇంకేముంది? డబ్బుల వరదే ప్రతి సీన్ లో !

అజ్ఞాతవాసి లో కూడా ., పవన్ చాలా రిచ్ . తనకి ఇష్టమైన., నచ్చిన క్యారెక్టర్ లో పవన్ చాలా అందం గా కనిపిస్తూ., ఆలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు .పవన్ అమ్మాయి వేషాలు.,హీరోయిన్స్ ని టీజింగ్ చేసే విధానం,యాక్షన్ ఎపిసోడ్స్ లో హీరోయిజమ్ ,గొప్పగా రాయని సెంటిమెంట్ సీన్స్ లో అవసరమైనంత నటన తో ఆకట్టుకున్నాడు. అత్తారింటికి దారేది లో లా ., బరువైన సీన్స్ ఏవీ పడలేదు . అతని లుక్స్,స్టైలింగ్ చాలా బాగున్నాయ్ .అంత వరకే ఆశించే అభిమానులు పండగ చేసుకోవచ్చు.

కీర్తి సురేష్ ముచ్చటగా కనిపించడం., ఉడుక్కోవడం వరకు పరిమితమైంది. అను ఇమ్మానుయేల్ గొప్ప అందగత్తె . తన అందమంతా ఇంకా అందంగా చూపించింది . తర్వాతి తెలుగు టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలం గా వున్నాయి . ఇద్దరికీ కూడా పవన్ ని పడేయడం తప్పితే పెద్దగా గోల్స్ ఏం లేవు ఈ సినిమా లో . మెయిన్ కథ తో పెద్ద గా సంబంధంలేని రోల్స్ ఇవి.

బొమ్మన్ ఇరానీ,కుష్బూ,రావు రమేష్ కి మంచి క్యారెక్టర్లు దక్కాయి. వాళ్ళ అనుభవం., నటనా పటిమ కచ్చితం గా ఆ యా సీన్స్ లో కనిపించింది .
ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్ గా బావున్నాడు . అతని క్యారెక్టర్ ని కూడా త్రివిక్రమ్ బాగా రాసుకున్నాడు కానీ., ఎక్కడ హీరో ని డామినేట్ చేసేస్తాడా అన్నట్లు లాస్ట్ లో హడావిడి గా ముగించాడు.

సాంకేతిక వర్గ పని తీరు కి వస్తే ., ముందే చెప్పుకున్నట్లు., త్రివిక్ర్రమ్ ప్రతి సీన్ ని రిచ్ గా తీసే శ్రద్ధ ., గొప్ప గా తీయడం లో పెట్టలేకపోతున్నాడు .అతని పెన్ను పదును కూడా తగ్గింది. ఎం చెప్పాలనుకుంటున్నాడో అర్ధమయ్యే సరికి., ఇంకో డైలాగు వచ్చేస్తుంది. అతని మెరుపులు., చమక్కులు., సెకండ్ హాఫ్ లో కొన్ని ఆఫీస్ కామెడీ సీన్స్ కే పరిమితమయ్యాయి. సెంటిమెంటల్ సీన్స్ ఇంకా బాగా తీయాల్సింది. త్రివిక్రమ్ స్థాయి లో అవి కచ్చితం గా లేవు.కథ లో కూడా .,ఎంత కాపీ కాదని త్రివిక్రమ్ వాదించినా .,హాలీవుడ్ లో తీసిన లార్గో వించ్ ఛాయలు బాగానే వున్నాయి.

తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ బాగుంది .సాంగ్స్ యావరేజ్ గా వున్నాయి., కానీ చిత్రీకరణ బావుంది. కొడకా సాంగ్ అంత బాగా పేలలేదు. మణికందన్ ఛాయాగ్రహణం అద్భుతంగా వుంది. అందమైన లొకేషన్స్., అంతకంటే అందమైన చిత్రీకరణ కట్టి పడేస్తాయి. కోటగిరిని ఎవరైనా కట్టేసి పని చేయించుకున్నారో ఏమో కానీ., అతని పని చాలా మిగిలి వుంది .కట్ చేసి పారేయాల్సిన చాలా చెత్త ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చేసాడు.

హారిక అండ్ హాసిని వాళ్ళు ., డబ్బులు పెట్టారు అనేకంటే వెద జల్లారు అనడం కరెక్ట్ ఏమో ! అడుగడుగునా ఆ రిచ్ నెస్ బాగా కనిపించింది.

చివరిమాట : పవన్ ఉంటే చాలు., ఎం తీసినా చూస్తారు., అనుకుంటే తప్పు కదా బాబాయ్..?మంచి కథ లో పవన్ ఉంటే బాగా చూస్తారు ., ఇంత చిన్న లాజిక్ త్రివిక్రమ్ ఎలా మిస్ అయ్యాడో ?
సంక్రాంతి అంటే మనకి సొంత వూరు,చుట్టాలు,ముగ్గులు,కోడి పందేలు ఇంకా పిండి వంటలే కాదండోయ్ ., మంచి తెలుగు సినిమా కూడా ..! అజ్ఞాతవాసి ఆ లోటు తీర్చేలా అయితే కనిపించట్లేదు కానీ.,ఎం చేస్తాం., అందరం వెళ్లి చూడటానికి ఒక సినిమా కావాలి కదా., సో వెళ్లి చూడండి .

ఒక్క ముక్కలో : ఈ త్రివిక్రమ్ కు ఏమైంది ? ఒక వైపు కాపీ ., మరో వైపు కదలని పెన్ను!

Advertisement