అఖిల‌ప్రియ నిర్ణ‌యంతో బాబుకు ఊహించ‌ని షాక్..?

వైసీపీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి మ‌ర‌ణం తరువాత తన కుమార్తె అయిన భూమా అఖిల‌ప్రియ వైసీపీ నుండి ఎమ్మెల్యే పదవిని అందుకుంది.

బాబు బయోపిక్ తీస్తే టైటిల్స్ ఇవే

ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయిన సంగ‌తి తెలిసిందే.ఇక తాజాగా టీడీపీకి మంత్రి భూమా అఖిల‌ప్రియ దూర‌మవుతున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే జిల్లాలో టీడీపీ నేత‌ల‌కి అఖిల‌ప్రియ‌కి మ‌ధ్య వార్ న‌డుస్తోంది. దీంతో అఖిల ప్రియ పంచాయితీ ఏకంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరాయ‌ని తెలుస్తోంది.

దీంతో తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన అఖిల‌ప్రియ‌, కర్నూలులో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సభ పెడితే ఆ సభకు కూడా రాలేదు.

ఇక చంద్ర‌బాబు జ‌రిపిన ఇన్న‌ర్ స‌ర్వేలో అఖిలిప్రియ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని తెలుస్తోంది.
ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా షాక్ తిన్న అఖిల‌ప్రియ పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో అఖిల‌ప్రియ జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశ‌లు ఉన్నాయ‌న్న వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి.

గ‌తంలో శోభానాగిరెడ్డి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున పోటీ చేసి నెగ్గారు. దీంతో గ‌తంలో ఉన్న ప‌రిచ‌యాల‌తో ఇప్ప‌టికే జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో అఖిల‌ప్రియ ట‌చ్‌లో ఉన్నార‌ని స‌మాచారం. 

Advertisement