అలసందల వడలు

నవధాన్యాలలో ఒకటి అయిన అలసందలలో పోషక విలువలు అమోఘంగా ఉంటాయి.
వీటిలో కాలరీలు తక్కువగా ఉండటం వల్ల’ లో ‘కాలరీ ఫుడ్ గా పేరు పొందాయి.
షుగర్ పేషెంట్స్ కి అద్భుతమైన ఆహారం.
వీటిని వడలు లా చేసుకొని తినడం వళ్ళ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము.
ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

క్యారట్ బ్రెడ్ రోల్స్

Alasanda Vadalu

కావలసిన పదార్థాలు:

అలసందలు – 1/2 కిలో,
పచ్చిమిరపకాయలు – 6,
ఉల్లిపాయలు – 2,(చిన్న ముక్కలు గా తరిగి పెట్టుకోవాలి)
అల్లం – 50 గ్రాములు,
జీలకర్ర – 2 టీ స్పూన్లు,
కరివేపాకు – 2 రెబ్బలు,
కొత్తిమీర – 1 కప్పు,
ఉప్పు – రుచికి తగినంత,
నూనె – సరిపడా.

తయారుచేయు విధానం:

ముందుగా అలసందల్ని శుభ్రంగా కడిగి ఆరు గంటలపాటు నానబెట్టాలి.
వీటిని మెత్తగా రుబ్బుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలుపుకోవాలి.
తరువాత పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి బాగా కాగాక మనకి కావలసిన సైజులో వడలు వేసుకుని సన్నని మంట పై వేయించుకొని తీసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి .
ఎంతో రుచికరమైన అలసందల వడలు రెడీ.