వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ!

Ali Joined in YSRCPఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అగ్ర తాంబూలం తెలుగు రాష్ట్రాలకు దక్కడం అంతా ఫాస్ట్ గా జరిగిపోయింది.ఈసారి ఏపీ నుంచే తొలి విడత పోలింగ్ మొదలుకానుంది.

జగన్ స్కెచ్ ను బాబు అడ్డుకోగలడా?

గతంతో పోల్చుకుంటే ఈసారి భిన్నంగా ఎన్నికల డిజైన్ మార్చారు. ఈ నేపధ్యలో ఒక్కసారిగా ఎన్నికల హడావుడి పెరిగింది.దీంతో అటు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ రెండూ కూడా బస్తీమే సవాల్ అంటున్నాయి.

షెడ్యూల్‌ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి.తాజాగా సినీ నటుడు అలీ జగన్ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈమేరకు జగన్ సాదరంగా అలీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ,జగన్ ని సీఎం చేయడమే తన ధ్యేయమని,తానే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని,పార్టీ తరుపున పోటీ చేయడం లేదని,జగన్ కోసం ప్రచారాలలో పాల్గొంటానని చెప్పుకొచ్చారు.

Advertisement