‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పుడు హీరోయిన్స్ వంతు..

అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ మారింది !

ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ షెడ్యూలు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ఇప్పుడు తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ తోపాటు హీరోయిన్లు అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారు.దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు.

ఇక ఈ మూవీ లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకానుంది.