‘#RRR’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఆలియా!

Alia Bhatt Clarity on RRRటాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘#RRR’.ఇప్పటికే ఈ చిత్రబృందం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.

తమిళనాడులోని రేసింగ్‌ ట్రాక్ మీద విజయ్!

అయితే ఈ సినిమాలో కథానాయికల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.ఇప్పటికే ఒక కథానాయికగా ఆలియా భట్ అని రాజమౌళి అనుకున్నారట.దీంతో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ని మద్యవర్తిత్వం కూడా తీసుకున్నారట.

కాకపోతే హిందీలో వరుస సినిమాలు చేస్తోన్న ఆలియా భట్, తనకి ఖాళీ లేదని ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ,పారితోషికం గురించి ఆలోచించి తాను నో చెప్పానని అనుకోవద్దనీ, నిజంగానే వరుస కమిట్మెంట్లు ఉండటం వల్లే తాను ఈ సినిమా చేయడం లేదని తెలిపింది.

Advertisement