అల్లు అర్జున్ కొత్త చిత్రం టైటిల్ అదేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ వార్త తప్ప ఇంతవరకు సినిమా అప్డేట్స్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇందులో పూజాహెగ్డే, క్యాథరీన్‌ కథానాయికలుగా నటిస్తారని టాక్‌.

ఎన్టీఆర్ పాత్రలో నారా దేవాన్ష్

త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘నాన్న.. నేను’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని ప్రచారం జరగుతోంది.తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందట.

‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.