డ్యూయెల్ రోల్ లో అల్లుఅర్జున్.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారంలో సెట్స్ పైకి తీసుకువెళ్లాడనికి త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్లు మొద‌లు పెట్టినట్లుగా తెలుస్తుంది.

బన్నీ పై బాలీవుడ్ బాద్ షా ప్రశంసలు..

ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం బన్నీ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడట.ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన ‘భ‌ర‌త్ అనే నేను’ఫేమ్ కియారా అద్వానీ క‌థానాయిక‌గా నటించనున్నట్లు తెలుస్తుంది.

జులాయి, S/Oస‌త్య‌మూర్తి వంటి చిత్రాల త‌రువాత బన్నీ, త్రివిక్ర‌మ్‌ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో రానున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

Advertisement