మరో సినిమాకి ఓకే చెప్పిన బన్నీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దరకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.మరోపక్క సుకుమార్ కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు అల్లు హీరో.

అల్లు అర్జున్ హోలీ సందడి చూశారా ?

ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఆయన దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాల డైరక్టర్ వేణు శ్రీరామ్ తో బన్నీ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

గతంలో దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు చేసిన వేణు శ్రీరామ్ ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి.