అల్లు హీరో కి “గారు” పెట్టి ఏం తిట్టినా ఓకే అట !

నిన్నటి రోజు అల్లు అర్జున్ “పడి పడి లేచే మనసు ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యి యధా విధి గా తన స్పీచ్ లో ఉండే అన్ని మసాలాలు కలిపి ఒక స్పీచ్ ఇచ్చాడు. సినిమా హీరో ,హీరోయిన్లయిన శర్వా -సాయి పల్లవి లను పొగిడి , తర్వాత ఒక విషయం గురించి ప్రస్తావించాడు.

అదేంటంటే ” రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన గౌరవం లేకుండా మాట్లాడతారా ? కెసిఆర్ గా .. చిరంజీవి ఇలా ఏక వచనం తో సంభోదిస్తారు ? వాళ్ళు ఎంతో చేస్తే కానీ ఆ పొజిషన్ లోకి రాలేదు . అలాంటి వాళ్ళకి కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే ఎలా ? గారు పెట్టి మీరు ఏమైనా అనండి. విమర్శించండి.. కెసిఆర్ గారు ..చిరంజీవి గారు ..పవన్ కళ్యాణ్ గారు అనే పిలవాలి ” అంటూ తనకున్న ఆవేదన బయటపెట్టాడు.

మరి ఇంతకీ ఈ బాధ వాళ్ళ మావయ్యలు రాజకీయాల్లోకి వస్తే కానీ తెలియలేదేమో లే పాపం ! మన దాకా వస్తేనే కదా ఏదైనా నొప్పి ! ఏదేమైనా మంచి విషయమే గా అని మనం కూడా సర్దుకోవాలి !! నేర్చుకోవాలి !!

‘సాహో’ విడుదలకు డేట్ ఫిక్స్!

 

కానీ అనాది గా వస్తున్న అలవాట్లు అంత త్వరగా పోవు. సినిమా వాళ్ళని , పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళని సొంత వాళ్ళలాగా మాట్లాడటం కొత్తేమి కాదు . ఎన్టీ వోడు , నాగ్గాడు, బ్రహ్మి, మోడీ అంటూ మాట్లాడుకోవడం సర్వ సాధారణం.కానీ నలుగురి ముందు మాట్లాడే షో లలో బన్నీ చెప్పినట్లు గౌరవం ఇస్తే బెటర్. కనీసం చెప్పాక అయినా కొంతమంది మారతారేమో .. కనీసం మెగా ఫాన్స్ అని చెప్పుకొనేవాళ్ళు !