సైరా లో బన్నీ వాయిస్ ఓవర్ …!

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశలో ఉంది.

సైరా నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ !

అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎలాంటి కీలక పాత్రలో నటించట్లేదు. కాకపోతే సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలకు బన్నీ వాయిస్ ఓవర్ తోనే మొదలవుతాయట.

బన్నీ ‘రుద్రమదేవి’ సినిమాలో చెప్పిన మాడ్యులేషన్ శైలిలోనే సైరాలో బన్నీ వాయిస్ ఓవర్ ఉంటుందని సమాచారం.భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది