అల్లువారి కుటుంబంలో విభేదాలు నిజమేనా?

Allu Family Issuesఅల్లు అరవింద్ ఆలోచనలతో నిర్ణయాలతో బన్నీ విభేధిస్తున్నాడని,తానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ, ఒక జాతీయ మీడియా సంస్థ తన వెబ్ సైట్ లో బయటపెట్టింది.

అల్లు అర్జున్ కి తల్లిగా టబు… ?

బన్నీ ప్రవర్తన వల్ల అరవింద్ విసుకు చెందారని,అందుకే ఆయన మహేష్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను అల్లు కాంపౌండ్ సన్నిహితులు ఖండిస్తున్నారు.

అసలు బన్నీ ప్రోత్సాహంతోనే అరవింద్ మహేష్ తో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడని, గీత ఆర్ట్స్ కేవలం మెగా హీరోలకు మాత్రమే పరిమితం కావడం అల్లు అర్జున్ కు ఇష్టం లేదని అంటున్నారు.

అంతేకాదు చిన్న హీరోలతో సినిమాలు తీయాలి అన్న ఉద్దేశ్యంతోనే, బన్నీ తన సొంత నిర్మాణ సంస్థను పెట్టుకున్నాడని,అంతేకానీ తన తండ్రితో విభేదించి కాదు అంటూ అల్లు కాంపౌండ్ సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు.