త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘సీతారామరాజు

గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను , రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సీతారామరాజు’ (ఏ ట్రూ వారియర్).

మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో రూపొందించనున్నారు.రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్ పై డా. శ్రీనివాస్ నిర్మాణంలో ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

యంగ్ శర్వానంద్ కోసం కాస్టింగ్ కాల్

మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..’ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది.

సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా చరిత్రకారుల సహకారంతో ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం’ . అని అన్నారు.

Advertisement