దేవరకొండ సినిమాలో అనసూయ!

Anasuya in Vijay Movieవిజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రూవ్ చేసుకోవాలని,ఓ సినిమాను నిర్మించబోతున్నాడట.అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోగా విజయ్ నటించడం లేదు.

విజయ్ వ్యూహాలు అంతుబట్టట్లేదే!

గతంలో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందట.కాగా ఈ సినిమా కథ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరగనున్నట్టు సమాచారం.

ఈ నాలుగు ప్రధాన పాత్రల్లో యాంకర్ అనసూయ కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి.తాజాగా అనసూయ ఈ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాలో నాలుగు ప్రధాన పాత్రలు ఉండబోతున్నాయని,తాను చేసేది రొమాంటిక్ పాత్ర కాదని, నటనకు మంచి గుర్తింపు వచ్చే పాత్రలో నటిస్తున్నాని క్లారిటీ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో వచ్చే సినిమాలో, తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని,తప్పకుండా తనకు పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని, మిగతా వివరాలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాక చెబుతానని అనసూయ అన్నారు.