ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం

 

నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారని. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదామని రాష్ట్ర ప్రజలందరికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఐదేళ్ళతరువాత తొలి సారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలందరికి గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలియచేసారు