దివ్యాంగురాలి పాత్రలో ‘భాగమతి’

‘భాగమతి’ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క,తాజాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీకి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే.

‘అల్లుడు శీను’ కొత్త సినిమా ప్రకటించారు

ఈ చిత్రానికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నారట.

కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ని మార్చ్ లో మొదలుపెట్టనున్నారు.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్ విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని మాధవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ…

‘హే గాయ్స్ .. నేను అనుష్క సినిమాలో చేస్తున్న‌ట్టు వ‌స్తున్న‌వార్త‌లు అవాస్త‌వం. ప్ర‌స్తుతం ఏ సినిమాలో కీ రోల్స్ చేయ‌డం లేదు’ అని ట్వీట్ చేశాడు.

Advertisement