వైరల్ అవుతున్న అనుష్క న్యూ లుక్ !

Anushka New Lookసౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న అనుష్క…చాలా రోజులు విరామం తీసుకుని కోన వెంకట్ నిర్మాణంలో ‘సైలెన్స్’ అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.

మన్మధుడు – 2 లో అమల

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అనుష్క ఎలా కనిపించబోతుందా..అనే ఆత్రుత అందరిలో పెరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సన్నబడిన అనుష్క లుక్ బయటకొచ్చి అందరికి షాక్ ఇచ్చింది.

సగానికి సగం బరువు తగ్గిపోయి నాజుకుగా కనిపిస్తోంది.ఈ పిక్ లో అనుష్క మునపటి కంటే చాల సన్నగా ఉండడం తో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.మర్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

Advertisement