‘సైరా’ లో స్పెషల్ రోల్ కోసం అనుష్క

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్ట్మాకంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’.

దేవరకొండ సినిమాలో ఛాన్స్ కోసం అనసూయ

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా ఓ స్పెషల్ రోల్ లోఅలరించనుంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరో స్పెషల్ రోల్ లో అనుష్కను అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

మొదట సైరా కోసం నయనతార కంటే ముందుగా అనుష్కనే అనుకున్నారు కానీ, అనుష్క సైజ్ జీరో ప్రభావం నుండి పూర్తిగా బయటపడకపోవటం, ఆమె గ్లామర్ మునుపటి కంటే తగ్గటం వల్ల అనుష్క విషయంలో వెనక్కి తగ్గారు మేకర్స్.

గతంలో అనుష్క ‘ అరుంధతి , బాహుబలి, రుద్రమదేవి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించటంతో సైరలో కూడా అనుష్క ఉంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. 

అనుష్క రోల్ ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలువనుందని, త్వరలోనే అనుష్క క్యారెక్టర్ తాలూకు లుక్ ను కూడా రివీల్ చేయనున్నారని సమాచారం అందుతుంది.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

Advertisement