అనుష్క పారితోషకం అంతేనట !

ఇటీవల అనుష్క యూరోపియన్ స్పా నుండి ట్రీట్మెంట్ ని పూర్తి చేసుకుని ఇండియా కి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

#RRRలో నా పాత్ర ఇదే :రామ్ చరణ్

ఇక తాజాగా అనుష్క కోన వెంకట్ బ్యానర్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఈ చిత్రానికి అనుష్క చాలా తక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లుగా సమాచారం.సౌత్ లో హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటి నయనతార.

ఆమె తరువాత అంత రెమ్యూనరేషన్ తీసుకునే నటి అనుష్కనే అని అంతా అంటారు.కానీ ఈ చిత్రానికి మాత్రం రూ.1.25 కోట్లు మాత్రమే తీసుకుంటుందట అనుష్క.

తక్కువ రేంజ్ హీరోయిన్లు సైతం రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్న ఈ రోజుల్లో అనుష్క మాత్రం అంత తక్కువ తీసుకోవడం ఏంటి అని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ ఒక చిత్రానికి మాత్రమే తక్కువ పారితోషకం తీసుకుంద..?లేక అన్ని చిత్రాలకి ఇలాగే తీసుకోనుందా అనేది తెలియాల్సి ఉంది. 

Advertisement