ఎన్నికల వేళ హస్తినలో బాబు కొత్త డ్రామా

ఇప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని హోదా రాగం అందుకున్నారు.ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదా జపం చేస్తున్నారు.

ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం :సభాపతి

నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదా ఊసెత్తని ఏపీ సీఎం ఇప్పుడు హస్తిన నడి వీధుల్లో వేస్తున్న నాటకాలు చూసి జనం నివ్వెరపోతున్నారు.

నరేంద్ర మోదీతో కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు రాలేదా అని ప్రజలు నిలదీస్తున్నారు.రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వడానికి చంద్రబాబు చేసిన స్టంట్‌ జనాలకు నవ్వు తెప్పిస్తోంది.

ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా చేసిన రాజీలేని పోరాటం దేశం యావత్తు తిలకించింది.

నిరాహారదీక్షలు, యువభేరిలు, ధర్నాలతో హోదా ఉద్యమాన్ని జననేత ఉరకలెత్తించారు. ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేస్తామని జగన్‌ ఆనాడే ప్రకటించారు.

నాలుగున్నరేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన చంద్రబాబు ఏపీలో నడిపించిన డ్రామాను ఢిల్లీ వీధులకు చేర్చారు.

ధర్మాట పోరాట దీక్ష పేరుతో హస్తినకు వెళ్లి ప్రత్యేక హోదా అంశాన్ని హైజాక్‌ చేసేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేసేశారు.

Advertisement