చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్ !


ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్షాలు వ్యూహ రచనలో బిజీ అయ్యాయి.ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఇక్కడ కూడా జగనే ఫస్టట !

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందే పథకాలను ప్రకటిస్తూ తనదైన చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల వృద్ధాప్య ,వికలాంగ ఫించన్ ను 2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచి, డ్వాక్రా మహిళలకు పదివేల నగదు, ఒక స్మార్ట్ ఫోన్ ప్రకటించారు.

తాజాగా చంద్రబాబు మరో అస్త్రాన్ని వదిలారు.గిరిజనులకు ఫించన్ పొందే వయసును 60 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు తగ్గించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఇక పై 50ఏళ్ళు దాటిన గిరిజనులంతా ఫించన్ కు అర్హులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 50ఏళ్ళు పైబడ్డ గిరిజనుల సమాచారాన్ని సేకరించాలని ఎంపీడీఓలకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఇది ఇలా ఉండగా ఈ మద్యే ప్రతిపక్షనేత జగన్ ఫించన్ అర్హత వయసు 45 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించారు.

Advertisement