ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం
సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని.. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం
అందిస్తాం.
(గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు మాత్రమే). తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్ లాండింగ్ సదుపాయాలను కల్పిస్తాం. మూడు కొత్త ఫిషింగ్ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె,
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పటిష్టానికి చర్యలు కూడా తీసుకుంటాం. మర పడవల నిర్వాహకులకు
గత ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంచుతున్నాం. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్ రాయితీ వర్తింపు.
ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తున్నాం. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది.