ఆంధ్ర మాట : బాబు పాలన కొంచెం ఇష్టం.. ఎక్కువ కష్టం!

ఆంధ్ర లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వివిధ చానెల్స్ , ఔత్సాహికులు సర్వే లు నిర్వహిస్తున్నారు . ఆ సర్వే లలో కొంత మంది బాబు పాలనా బాగానే ఉందంటే ., మరి కొందరు అబ్బే .. బాలేదు అని పెదవి విరుస్తున్నారు. మరి కొందరేమో “మార్పు కావాలి ” అంటే ., ఇంకొందరు “మార్పు వస్తే ., పనులు పూర్తి కావు ” అంటున్నారు.

ఇలా మిశ్రమ స్పందన తో ఏపీ ప్రజలు వారి వారి తీర్పు ఇస్తున్నారు . దీంతో ఏపీ ఫలితం ఎలా ఉంటుందో అని మరికొంత ఉత్కంఠ నెలకొంటోంది. లోతుగా పరిశీలిస్తే ., వ్యాపారులు , ప్రభుత్వం తో పెద్దగా లాభం పొందని వారు “వైసీపీ కి ఓటేసి చూస్తాం ” అంటున్నారు . కొంతం లాభం పొందిన వారు , రోడ్స్ ,డ్వాక్రా రుణాలు పొందిన వారు “మళ్ళీ ఆయన వస్తేనే బావుంటుంది ” అంటూ బాబు కే ఓటేస్తున్నారు.

AP Elections Survey

ఎక్కువగా రైతులు బాబు కు వ్యతిరేకం గా ఉన్నారు. అలానే జగన్ తొమ్మిదేళ్లుగా ప్రజల్లో ఉందిక్ చేస్తున్న యాత్ర లపై కూడా ప్రజలు సానుభూతి తో ఉన్నారు.

ఇక పవన్ స్థాపించిన జనసేన కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ పార్టీ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ప్రస్తుతానికి తక్కువే వుంది. ఈ మిగిలిన 4 నెలల్లో , పవన్ వ్యూహాలు – అభ్యర్థుల ఎన్నిక కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.