ఎగ్జిట్ పోల్స్ : ఊరంతా ఒక దారి .. లగడపాటిది పచ్చ దారి !

40 రోజుల నిరీక్షణ ఇంకొన్ని గంటల్లో ముగియనుండగా ..ఎగ్జిట్ పోల్స్ అంటూ రకరకాల సర్వేలు ఈ రెండు రోజులనుంచి హడావిడి చేస్తున్నాయి . అందరు ఉహించినట్టుగా చాలా పేరున్న సంస్థలు వారి సర్వేల్లో వైసీపీ కి ఏక పక్షం గా అత్యధిక సీట్స్ వస్తాయని , సైకిల్ పార్టీ ఈ సారి ప్రతిపక్షం లో కూర్చోవాల్సి ఉంటుందని చెప్పాయి.

అంట సులువుగా ఓటమి ని అంగీకరిస్తే అది పచ్చ పార్టీ ఎలా అవుతుంది ? బాకా ఊదే చానెల్స్ ని , కొత్త భజన బృందం నాయకుడు లగడపాటు ని కలిపి ఆర్జీ ఫ్లాష్ సర్వే అంటూ వచ్చేసింది. ఈ సర్వే టీడీపీ 100 + సీట్స్ తో మళ్ళీ అధికారం చేజిక్కించుకోబోతోందని చెప్పింది . 60 + సీట్స్ తో వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని లగడపాటి సెలవిచ్చారు . అదేంటి అని ఎవరైనా అడిగితే .. “నా సర్వే తప్పదు . తప్పితే సర్వే సన్యాసమే ” అని తొడకొట్టారు కూడా!!

ఎందుకబ్బా టీడీపీ అంటే ఇంత ప్రేమ ?? మొన్నటికి మొన్న తెలంగాణ లో తెరాస గెలుస్తుంది అని పక్కాగా తెలిసాక కూడా కాంగ్రెస్ – టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పి నవ్వులపాలయ్యారు . ఇప్పుడు అదే విధంగా ఆంధ్ర లో కూడా చెప్తున్నారు . ఏమో లగడపాటి జోస్యం పాలించి టీడీపీ వచ్చేస్తే ?? లోకేష్ గారి ప్రమాణ స్వీకారం చూడాలా ? హతవిధీ!

lagadapati survey 2019