నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం

ఆంద్ర ప్ర‌దేశ్ లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ఖజానా పై మోయలేని భారాన్ని మోపుతున్నాయి.

జగన్ కన్ను వారి పై పడిందట

సుమారు 30 వేల కోట్లు ఖర్చుపెడితే కానీ చంద్రబాబు సర్కారు ఫిబ్రవరి నెలను దాటలేదు.
ఫిబ్రవరి నెల‌లో ఖర్చుపెట్టుకోవడానికి సంబంధించిన నిధుల కోసం ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రతినిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అప్పు స‌మీక‌రించ‌క‌పోతే ప్రభుత్వ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుందనే ఆందోళన అధికారవర్గాల్లో వ్య‌క్తం అవుతోంది.

ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో ప్రకటించిన పథకాలన్నీ నెరవేర్చాలంటే 30 వేల కోట్ల రూపాయల నిధులు అవసరపడతాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అందులో కనీసం పదో వంతు రాబడి కూడా ఈ నెలలో ఏపీ ఖజానాకు జమ అయ్యే పరిస్ధితులు లేదు.దింతో నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం.