అర్చకుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అర్చకులకు వంశపారంపర్య హక్కును కల్పిస్తూ జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు. అధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే అర్చకుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన సీఎం వైయస్ జగన్.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అర్చకుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్చకులకు వంశపార్యంపర హక్కు కల్పిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకొని సోమవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు.2007 లో మహానేత వైయస్‌ఆర్‌ అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకురాగా, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. జీవో నంబర్‌ 76ను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.