టీడీపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

ఐపీఎఎస్‌ల ను అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

జ‌గ‌న్‌కు టీఆర్ఎస్ వెయ్యి కోట్ల.. పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌ !

దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఐపీఎఎస్‌ల బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులపై ఈసీఐ జోక్యం తగదని 1978లో సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చూపారు.