ఎల్లుండే ఏపీ ఎన్నికల షెడ్యూల్ ..

ఆంధ్రప్రదేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేపథ్యం లో ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

నిధులు అందుకునే అర్హత ఏపీ కి లేదట

ఎన్నిక‌లలో భాగంగా ఏపి లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తోందని ,ఎల్లుండి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉందని దీంతో ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేసి ప‌లు పెండింగ్ నిర్ణ‌యాల‌కు ఆమోదం తెల‌ప‌నుంది.

ఈ నెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌, దాంతోపాటే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.
దీంతో రాష్ట్రప్రబుత్వానికి కొత్త పథకాలు ప్రకటించడానికీ, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకూ వీలు ఉండదు.

దాదాపుగా సగం పైగా జిల్లాల కి రాష్ట్రంలో మూడు రోజుల పటు కోడ్‌ అమల్లోకి రానుంది. ఆ తరువాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది.ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.

Advertisement