ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే తప్పేంటి?

AP People Opinionఏపీ ఎన్నికల్లో తెలుగుదేశానికి పరాభవం తప్పదని దాదాపు చాలా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ పై విమర్శల జోరు పెంచారు. ప్రతి సభలోనూ జగన్‌ కు భవిష్యత్ లేకుండా చేయాలని నినాదాలు ఇస్తున్నారు.

దిక్కు తోచని స్థితిలో మంత్రి నారాయణ!

 

ఓ వ్యక్తి భవిష్యత్తే లేకుండా చేయాలని చెప్పడం, ఆ వ్యక్తిపై ఉన్న ద్వేషానికి ఓ కొలమానంగా జనం భావించే అవకాశం ఉంది.జగన్‌ కు భవిష్యత్ లేకుండా చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ఆంధ్ర ప్రజలు మండిపడుతున్నారు.

ఇన్నాళ్లూ చంద్రబాబు పాలన చూశామని ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఏపీలో మెజారిటీ ప్రజలు ఇలాగే ఆలోచిస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి.

జగన్‌ కు భవిష్యత్‌ లేకుండా చేయాలని చంద్రబాబు పిలుపు ఇస్తే, అది కాస్తా కుడి ఎడమైతే ఇక చంద్రబాబుకు భవిష్యత్ లేకుండా పోతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.