ఏపీ ప్రభుత్యం మరో ముందడుగు …… ఇక ఆన్ లైన్ లోనే చేనేత వస్త్రాలు

 

జగన్ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేఅందుకు, ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం “వైఎస్సార్ చేనేత హస్తం” ని ప్రకటించి ప్రతి ఏడాది 24 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. అంతేకాకుండా మరో ముందడుగు వేసి, చేనేత వస్త్ర కార్మికులకు పెద్ద సవాలు గా మారుతున్న క్రయవిక్రయాలు వ్యవస్థను నూతన మార్పు చేసి, దేశ విదేశాలలో కూడా చేనేత వస్త్రాలను కొనేవిధం గా ఆన్ లైన్ విధానం ను తీసుకోని రావటానికి ఏపీ ప్రభుత్యం, ఇప్పటికే ఆన్ లైన్ వ్వాపారం లో ముందంజ లో ఉన్న ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ సంస్థల తో ఒప్పందం చేసుకుంది.

నవంబర్‌ 1 నుంచి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు విస్తరించనున్నారు. దీని ద్వారా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున లాభపడతారు.ఆన్ లైన్ వస్త్రాలు అందరి కి అందుబాటు లో ఉండే విధం గా 500 నుండి మొదలయ్యి 20000 వరకు ఉన్న వాటిని ఉంచనున్నారు. ఆడవారు ఎంతో ఇష్టపడే ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పెడన, పొందూరు, వెంకటగిరి, మాధవరం మొదలైన ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలను విక్రయాలకు ఉంచనున్నారు. బయటి మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు వీటిని అందించేలా చర్యలు తీసుకున్నారు. చేనేత వస్త్రాల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా వాటిపై ప్రభుత్వ గుర్తింపు లోగోను ముద్రించనున్నారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 25 ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా నవంబర్‌ 1వ తేదీ నుంచి విక్రయాలు చేపట్టనున్నారు. అదే విధం గా నవంబర్‌ నెల చివరి వారం నుంచి ఫ్లిప్‌కార్టు ద్వారా అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి. .