అరవింద సమేత రివ్యూ : ఆయుధాలే వద్దంటున్న వీర రాఘవ రెడ్డి కథ !

అరవింద సమేత వీర రాఘవ రివ్యూ | అరవింద సమేత రివ్యూ | అరవింద సమేత రివ్యూ ,రేటింగ్ | అరవింద సమేత రేటింగ్ | ఎన్టీఆర్ | పూజ హెగ్డే | ఈషా రెబ్బా | జగపతి బాబు

అరవింద సమేత వీర రాఘవ రివ్యూ: 2.75/5.0

Aravinda Sametha Movie Review In English

తారాగణం : ఎన్టీఆర్ ,పూజ హెగ్డే ,ఈషా రెబ్బా ,జగపతి బాబు ,సునీల్
దర్శకుడు : త్రివిక్రమ్
నిర్మాణ సంస్థ : హారిక & హాసిని క్రియేషన్స్
సంగీతం : ఎస్ ఎస్ థమన్
రచయతలు : సిరివెన్నెల ,రామజోగయ్య ,పెంచల్ దాస్
సినిమాటోగ్రఫీ : వినోద్

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కలయిక లో వస్తున్న మొదటి సినిమా “అరవింద సమేత వీర రాఘవ “. ఈ సినిమా ఈ రోజు అమెరికా లో విడుదల అవుతోంది . ఎన్టీఆర్ మాస్ యాక్షన్ కి పెట్టింది పేరు , త్రివిక్రమ్ తన దైన శైలి ఉన్న క్లాస్ దర్శకుడు . మరి ఇలాంటి అరుదైన కలయిక ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది కుతూహలం గా ఉన్నారు .కనుక మీ కోసం Thatisy మొట్ట మొదటి రివ్యూ ని ఇక్కడ అందిస్తుంది.

కథ :

రాయల సీమ లోని ముఠా కక్షలు, వాటి మధ్య నలిగే రెండు ఊర్ల కథ “అరవింద సమేత “. నారప రెడ్డి (నాగ బాబు ),బసి రెడ్డి ( జగపతి బాబు ) రెండు ఊర్ల పెద్ద మనుషులు. నారాప రెడ్డి కొడుకు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్ )ఊర్లోకి వస్తున్నాడని తెలిసిన బసి రెడ్డి దాడి చేస్తాడు . ఆ దాడి లో నారప రెడ్డి చనిపోవడం తో ఈ గొడవ కొత్త మలుపు తీసుకుంటుంది. జేజమ్మ(సుప్రియ పాఠక్ )మాట కి విలువిచ్చిన రాఘవ రెడ్డి ఊరొదిలి వెళ్తాడు.

ఆ కక్షలు సద్దు మణిగే వరకు అజ్ఞాతం లో ఉండాలని హైదరాబాద్ కి వస్తాడు . అక్కడ అతను ఎవరెవర్ని కలుస్తాడు? అతను అనుకున్న శాంతి ఊర్లో వచ్చేస్తుందా ? బసి రెడ్డి , అతని కొడుకు బాల్ రెడ్డి (నవీన్ చంద్ర ) ఆ 6 నెలల కాలం లో మారిపోతారా ? అనేవి తెర మీద చూడాల్సిందే !

Aravinda Sametha Movie Review In English

విశ్లేషణ :

దసరా కి అజ్ఞాత వాసం వదిలిన అర్జునుడు మరియు అతని అన్నదమ్ములు వారి వారి ఆయుధాల్ని జమ్మి చెట్టు మీద నుంచి తీసి పూజించి, కురుక్షేత్రానికి తీసుకెళ్లారనేది మహాభారతం లో చెప్పిన కథ ! కానీ ఈ దసరా కి మన త్రివిక్రమ్ “ఆయుధాలే వద్దంటున్న రాఘవ రెడ్డి ” ని తీసుకొచ్చాడు. కథ బాగానే అనిపించినా.. సమకాలీనత లోపించడం ,కథనం చప్పగా ఉండడం, తెర అంతా మాసిపోయిన, భీతి గొల్పే ముఖాలు గాయాలతో కనిపించడం “అరవింద ” కు పెద్ద ప్రతికూలత.

ఎన్టీఆర్ లాంటి నటుడు , త్రివిక్రమ్ లాంటి కలం కలిస్తే ఎలాంటి సినిమా రావాలి ? అని మనం అనుకుంటుంటే ., ఎలా తీయాలో తెలియక చేతులెత్తేసినట్లుంది ఈ సినిమా వాలకం. మొదటి సగం కథ కు సరిపోయే మూల కథ ని చెప్పడం , చక్కటి ప్రేమ కథ తో నడిపించిన దర్శకుడు రెండో సగం లో దారి పూర్తిగా తప్పేశాడు.

బసి రెడ్డి మనుషులు హీరోయిన్ ని ,ఆమె తమ్ముడిని తీసుకెళ్లడం,హీరో ఒక్క ఫోన్ కాల్ చేయగానే వణుక్కుంటూ వారిని వదిలి పారిపోవడం చాల అసంబద్ధం గా అనిపిస్తాయి. ఎన్టీఆర్ -నవీన్ చంద్ర మధ్య జరిగే శాంతి ఒప్పందం ఒక్కటే ద్వితీయార్ధం లో బావుంది . మిగతా అంతా కత్తులు,రక్తం , గాయాలతో భయ పెట్టే మొహాలు .. అమ్మో !! కష్టం వాటిని భరించడం !!

ఏదో ., కాస్త సేద తీరుదామని సినిమాకి వెళ్లే ప్రేక్షకుడి కి కచ్చితం గా తలనొప్పి తెప్పిస్తుంది “అరవింద సమేత “. సినిమా లోని మూల కథే మనకి ఎక్కట్లేదు అనుకుంటే ., ఇక దానికి తోడు గా వచ్చే సంభాషణ లకీ మనల్ని మనం ఒప్పించకోలేక పోతాం.

నటీ నటుల విషయాన్ని వస్తే .,ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు .అతని నటన ,రౌద్రం , శరీర సౌష్టవం ఈ పాత్ర కి బాగా సరిపోయాయి. పూజ కి పరిణితి చెందిన పాత్రే ఇచ్చినా , ఆమె పాత్ర మొదటి సగానికి అయిపోతుంది. రెండో సగం లో కేవలం పాట కోసం అన్నట్లు ఊరికి వస్తుంది .అంతే!

నరేష్ ,ఈషా ,సునీల్ ,దేవయాని ,సితార ,ఈశ్వరి రావు ,బ్రహ్మాజీ ఇలా ఉండటానికి చాలా మందే ఉన్నా ., ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలు లేవు. జగపతి బాబు బయపెట్టించాడు అనేకంటే ., జుగుప్స కలిగించాడు అనాలి . నాగబాబు పాత్ర మొదటి పది నిమిషాల్లో అయిపోతుంది.

ఇక హారిక ,హాసిని వాళ్ళు ఖర్చు పెట్టినా , రాయలసీమ నేపధ్యం లో అదేమీ అంత కనిపించలేదు.వినోద్ ఫోటోగ్రఫీ బావుంది.థమన్ మ్యూజిక్,నేపధ్య సంగీతం బావున్నాయి.పాటలు తెర మీద కూడా బావున్నాయి.

ఎటొచ్చి దర్శకుడి పని తీరే అంత సంతృప్తి కలిగించలేదు . త్రివిక్రమ్ బాణీ లో ఉండే సంభాషణలు కొన్నే ఉన్నాయి. అవి కూడా సీన్స్ ని హై లైట్ చేసేలా లేవు. ఇక యాక్షన్ సీన్స్ తీయడం లో అతని డొల్ల తనం కనిపించింది. విరిగిన కత్తులు ,తెగిపడిన శరీర భాగాలూ , ఎగజిమ్మే రక్తం .. యాక్షన్ అంటే ఇదే అనుకున్నట్లున్నాడు కాబోలు !!

Aravinda Sametha Movie Review In English

చివరి గా : చివరిగా ., అరవింద సమేత కొంచెం కొంచెం గా మెప్పిస్తుంది. పూర్తి గా అయితే కాదు . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అంటే ఒక అంచనా ఏర్పడింది కానీ ., దాన్ని వదిలేసి వెళ్తే మొదటి సగం పర్లేదు అనిపిస్తుంది.

ఒక్క మాటలో : ఆయుధాలే వద్దంటున్న వీర రాఘవ రెడ్డి కథ !

 

Advertisement