వైసీపీలోకి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్!

Avanthi Srinivasa Rao Leaves TDPఎన్నికలు దగ్గరవుతుండటంతో నేతల పార్టీ ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి.దీంతో చంద్రబాబుకు బీపీ అమాంతం పెరిగిపోతోందట.ఎందుకంటే పార్టీని ఫిరాయిస్తున్న వారు టీడీపీ నేతలే.

కడపలో టీడీపీకి గుండు సున్నా..

ఇప్పటికే కడపలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ లోకి వెళ్లి పోయాడు.అలాగే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయాడు. 

తాజాగా వీరి జాబితాలో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గడచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలంతా అటు టీడీపీలోనో ఇటు వైసీపీలోనో చేరిపోయారు. గంటాకు ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ అవంతి గంటాతో పాటు టీడీపీలో చేరారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవంతి భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సీటులో మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాబట్టి భీమిలీ నుండి రాబోయే ఎన్నికల్లో అవంతి తానే పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.

చివరకు ఈ వివాదం చంద్రబాబు దగ్గరకు చేరినా పంచాయితీ కుదరలేదు.దీంతో ఆయన టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి రానున్నారని బలంగా వినిపిస్తున్న వార్త.