చంద్రబాబుకు నచ్చినట్లు చేస్తేనే లేదంటే..

Avanthi Srinivasa Rao about CBNవైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో,అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌ ను కలిసినట్లు వెల్లడించారు.

‘అన్న వస్తున్నాడు’ అంటూ జనంలోకి జగన్!

 

ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కారణంగానే ప్రధాని మోదీతో చంద్రబాబుకు విభేదాలు వచ్చాయన్నారు.అంతేగాని రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరని, రాష్ట్రంలోని అవినీతి, బంధుప్రీతి కారణంగానే కేంద్రంతో విభేదాలు తలెత్తాయని చెప్పారు.

ఆనాడు వైసీపీ ఎంపీలతో పాటు మేము రాజీనామా చేస్తే ప్రయోజనం ఉండేది. మనం కూడా రాజీనామా చేద్దామని బాబుకు చెప్తే అస్సలు వినలేదన్నారు.చంద్రబాబుకు నచ్చినట్లు చేస్తేనే మంచివాళ్లని, లేదంటే అవినీతి పరులుగా ముద్ర వేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని,రాష్ట్రం కోసం పనిచేసే తపన ఉన్న వ్యక్తి జగనేనని,అందుకే వైసీపీలో చేరానని అవంతి వ్యాఖ్యానించారు.