‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి అవసరం సాంగ్ విడుదల!

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కేవలం వేషాలకు మాత్రమే పరిమితమని ,ఎన్టీఆర్ మహానాయకుడు చంద్రబాబు కోసమే అని ,టోటల్ గా ఎన్టీఆర్ బయోపిక్ పై అభిమానులు బాగా అసంతృప్తిగా ఉన్నారు.

బాబు ఎత్తులు వర్మ దగ్గర సాగట్లేదే!

ఇలాంటి సమయంలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరపైకి తెచ్చారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ చివరి దశలో ఎదుర్కొన్న కష్టాలు,కన్నీళ్లు మన కళ్లకు కట్టినట్లు చూపిస్తానని వర్మ అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ ,మొదటి పాటకు అనూహ్యమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ సినిమా నుండి ‘అవ‌స‌రం’ అంటూ సాగే పాట వీడియో విడుద‌ల చేశారు.

‘అవసరం చుట్టే సమాజం తిరుగుతుందని.. అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా’ , ‘గుండెల్లో గునపాలు దించి మనిషి పోయాక విగ్రహాలకు దండ వేయడం అవసరం’ అంటూ వర్మ తనదైన శైలిలో ఘాటుగా చూపించారు.ఇంకెందుకు ఆలస్యం ఈ పాటను మీరు కూడా చూడండి.