గిన్నిస్ రికార్డులో దీపోత్సవం …..6 లక్షల స్వర్ణకాంతుల తో అయోధ్య ….

 

సరయు నది తీరం లో రామ్‌కీ పౌడీ వద్ద 6 లక్షల కి పైగా ప్రమిదల తో స్వర్ణ కాంతుల తో సరయు నది దేదీప్యమానంగా విరాజిల్లింది గత మూడు సంత్సరాల నుండి ఈ దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు . 2017లో తొలిసారి రామ్‌కీ పౌడీ వద్ద 3 లక్షలకి పైగా ప్రమిదలు వెలిగించగా, 2018లో 4 లక్షల 10 వేల ప్రమిదలు వెలిగించారు. ఈ ఏడాది ఆరు లక్షలకుపైగా దివ్వెలను వెలిగించడం విశేషం. యూపీ ప్రభుత్వం, పర్యాటక శాఖ, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడక గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ల్లో చోటు సంపాదించింది.

ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ దేశంలోని ఏడు ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల్లో మూడు యూపీలోనే ఉన్నాయని పేర్కొన్నారు . ప్రపంచంలోనే ఇలాంటి సంపన్న, సాంస్కృతిక వాతావరణం ఎక్కడ లేదన్నారు. రాముడి జన్మించిన ప్రదేశం మన రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని, అయోధ్య పేరు మన మనస్సుల్లో ‘రామ రాజ్యం’ ఆలోచనను కలిగిస్తుందని అన్నారు. రామరాజ్యంలో కుల, మత, జాతి, భాష భేదంలేదని, అదే రాముడి సుపరిపాలన వ్యవస్థ అని కొనియాడారు. గత అయిదేళ్లుగా కేంద్రం అనేక పథకాలను అమలుచేస్తూ ఆధునిక రామరాజ్య స్థాపనకు ఓ నిదర్శనం గా నిలిచిందన్నారు. యూపీ సర్కారు అయోధ్య దీపోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.