రోజురోజుకి దిగజారుతున్న బాబు రాజకీయం!

Babu Comments on Modi Wifeగుంటూరులో బీజేపీ నిర్వహించిన “సథ్యమేవజయతే” సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

వైసీపీ లోకి మరో సీనియర్ కాంగ్రెస్ నేత?

ఆయన మాట్లాడుతూ,దేశంలో అందరికంటే సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ తానేనని పదే పదే చెప్పుకునే చంద్రబాబు,పార్టీలు ఫిరాయింపులు చేయడంలోను , కొత్త కొత్త కూటములను కట్టడంలో సీనియర్ అని,ఇవాళ ఎవరిని తిడుతారో- ఆ తర్వాత వారి ఒడిలోనే కూర్చోవడంలో ఆయన సీనియర్‌ అంటూ మోదీ విమర్శలు గుప్పించారు.

దీంతో చంద్రబాబు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో కాస్త సంయమనం కూడా కోల్పోయారు. మోదీపై వ్యక్తిగతంగా ఆయన భార్య విషయం ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ లో,నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుందని ట్వీట్ చేశారు.

దీంతో నెటిజన్లు చంద్రబాబుపై మండిపడ్డారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజా జీవితానికి వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టి మాట్లాడటం, మిమ్మల్ని మీరు మరింత దిగజార్చుకోవడమేనని అంటున్నారు.

Advertisement