బాబుకు జగన్ ఇప్పుడు గుర్తొచ్చాడట!

Babu Politics

డిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఎవరినైనా కలుపుకుని పోతానని ,ఈ విషయంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పుకొచ్చారు.

బాబు – మోదీల దీక్షలు జగన్ కి లాభమా?

జగన్ తో కలసి పోరాటం చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ ఇపుడు చాల కష్టాల్లో ఉంది. అనేక ఇబ్బందులు పడుతోంది. ఈ సమయంలో అంతా ఒక్క త్రాటిపైకి రావాలి. జగన్ ఆయన పార్టీ కనుక ముందుకు వస్తే తమ పోరాటం మరింత ఉధ్రుతం చేస్తామని బాబు అన్నారు.

నిజానికి ఏపీలో ప్రత్యేక హోదా పొరాటం మొదలుపెట్టిందే వైఎస్ జగన్,ఆనాడు తమతో కలసి రావాలని జగన్ బాబును పదే పదే కోరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆనాడు జగన్ తో కలవడమేంటి అంటూ బాబు అండ్ కో జగన్ ని నిందించి, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కన పెట్టారు.

ఇంకా చెప్పాలంటే అవిశ్వాసం కేంద్రంపై పెట్టే వేళ కూడా జగన్ బాబుకు విన్నపాలు ఎన్నో చేశారు. మీరే అవిశ్వాసం పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పారు. అప్పుడు కలిసి పోరాడని బాబు,ఇప్పుడేమో అందరిని కలుపుకొని పోరాడుతున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడు.

Advertisement