వైసీపీపై భారీ కుట్ర!

Babu tricks on YCPకొంత మంది విజయానికి దొడ్డిదార్లు కూడా కనిపెడుతుంటారు. అక్రమ పద్దతుల్లో విజయం కోసం అర్రులు చాస్తారు.ఇప్పుడు అలాంటి వారిలో తెలుగు దేశం పార్టీ కూడా చేరినట్టు కనిపిస్తోంది.

దిక్కు తోచని స్థితిలో మంత్రి నారాయణ!

 

అసలు విషయానికి వస్తే ,ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ను శిఖండిలా అడ్డుపెట్టుకుని, ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు చూపుతున్న ఉదాహరణలు కూడా అలాగే ఉన్నాయి.

రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లు ఉన్న అభ్యర్థులతోనే ప్రజాశాంతి నామినేషన్ వేయించింది. అంటే వారికి వచ్చే ఓట్లను చీల్చే కుట్ర భారీగా జరుగుతోందన్నమాట.

ఇందుకు ఉదాహరణ అనంతపురం జిల్లా,పెదకూరపాడు, పరుచూరు వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ కుట్ర భారీ స్థాయిలో ఉంది. ఈ జిల్లాలలో పోటీ చేసిన వైసీపీ, ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే ఈ కుట్ర అర్థమవుతుంది. మరి ఈ కుట్రను జనం అర్థం చేసుకుంటారని వైసీపీనే గెలిపిస్తారని ఆ పార్టీ నమ్ముతోంది.