రూలర్ మూవీ ఫస్ట్ లుక్ ” నందమూరి అభిమానుల దీపావళి సందడి “

Image result for ruler balakrishna

నందమూరి అభిమానులకు దీపావళి కానుకగా బాలకృష్ణ కొత్త చిత్రం టైటిల్ మరియు బాలకృష్ణ న్యూ లుక్ ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తాజా చిత్రానికి ‘రూలర్‌’ అనే పేరును విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకోగా, కొత్తగా రిలీజైన పోస్టర్‌ నందమూరి అభిమానుల్ని అలరిస్తోంది. సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహన్‌, వేదిక హీరోయిన్‌లుగా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్‌ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్‌ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.