నందమూరి ఫ్యామిలీలో గుబులు రేపుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్!

Balakrishna about Lakshmis NTRలక్ష్మీ పార్వతి జీవితానికి సంబంధించిన సంఘటనల చుట్టూ తీయబడిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.తాజాగా ఈ చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేశారు.

చంద్రబాబుని వదలని వర్మ!

 

ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ కూతురు లక్ష్మీ పార్వతిని చెంప దెబ్బ కొట్టినట్లు చూపించడంతో పాటు, చంద్రబాబు వాయస్ తో ‘దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్’ అంటూ వర్మ పెట్టిన డైలాగ్ నందమూరి ఫ్యామిలిలో గుబులు రేపుతోంది.

దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాలకృష్ణ ,ఈ ట్రైలర్ ను సాకుగా తీసుకుని ఈ సినిమాకి న్యాయపరమైన చిక్కులు సృష్టించగల అవకాశం ఉందా, అన్న కోణంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా లక్ష్మీ పార్వతి జీవితానికి సంబంధించింది కనుక ఆమె అనుమతులు ఇప్పటికే లభించాయి.చూడాలి మరి వర్మ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో.