మితిమీరిపోతున్న అధికార పార్టీ అరాచకాలు

రోజు రోజుకి అధికార పార్టీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ ఒంగోలులోని కమ్మపాలెంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.

టీడీపీ నేతల వలసలు అందుకేనట

Balineni Srivnivas Reddy Arrestedకమ్మపాలెంలోకి వైఎస్సార్‌సీపీని అనుమతించేది లేదని టీడీపీ కార్యకర్తలు కాలనీ ఎంట్రన్స్‌ వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న టీడీపీ నేత దామచర్ల వర్గీయులను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ… పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ కార్యకర్తలు

తలచుకుంటే టీడీపీ నేత దామచర్ల జనార్దన్‌ నియోజకవర్గంలో తిరగనివ్వరని, కానీ తమది అలాంటి సంస్కృతి కాదని బాలినేని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో తాము ఒడిపోతామని భయంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తు అక్రమ అరెస్ట్‌ చేయిస్తున్నారు టీడీపీ నేతలు.

Advertisement