బెండకాయ మసాల కూర

బెండకాయ మసాల కూర;

బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ వలన కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి .బెండకాయ లో అనేక ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య లాభాలు కూడా చాలా విస్తృత పరిధిలో ఉన్నాయి. దీనిలో A,B,C,E మరియు K విటమిన్లు,అలాగే కాల్షియం,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి ఆస్తి విలువ కేవలం రూ . 1520 రూపాయలే

Bendakaya Masala Curry

 

కావలసిన పదార్ధాలు;
–> బెండకాయలు – ½ కిలో (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
–> ఉల్లిపాయలు – 2 (పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోవాలి)
–> నూనె – 1½ టీస్పూను ,
–> టమాటాలు – 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
–> అల్లం – ½ టీస్పూను (సన్నగా తరగాలి)
–> వెల్లుల్లి ముద్ద – ½ టీస్పూను
–> మినపప్పు – 1 టీస్పూను
–> కారం – 1 టీస్పూను
–> ఆవాలు – ½ టీస్పూను
–> ఎండుమిర్చి -1
–> పసుపు – ½ టీస్పూను
–> కొబ్బరి తురుము – 1½ టీస్పూను
–> గరం మసాలా – 1 టీస్పూను
–> కరివేపాకు – ఒక రెమ్మ
–> మామిడికాయ పొడి – ½ టీస్పూను
–> జీడిపప్పు – 10 (పాలలో నానబెట్టుకోవాలి)
–> ధనియాల పొడి – 1½ టీస్పూను
–> పెరుగు – 1 కప్పు
–> ఉప్పు – రుచికి సరిపడా
–> నీళ్లు – 2 కప్పులు
–> ఇంగువ – చిటికెడు
–> జీలకర్ర – ½ టీస్పూను

తయారుచేయు విధానం:

ముందుగా పాలలో నానబెట్టిన జీడపప్పు, కొబ్బరి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి .
బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేయాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి పొడిగా వేయించుకొని ఒక పేపర్ టవల్ మీద వేయాలి.
   అదే పాన్ లో మరికొద్ది నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,మినపప్పు, కరివేపాకు వేసి , వేయించుకొని అందులోనే ఉల్లిపాయలు, అల్లం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం , పసుపు, ధనియాల పొడి, మామిడికాయ పొడి , వెల్లుల్లి ముద్ద మరియు గరం మసాలా వేసి వేయించుకోవాలి.
    ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక అందులో జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ , పెరుగు వేసి కలుపుకోవాలి.
అందులో బెండకాయ ముక్కలను కూడా వేసి సరిపడా నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు వేసి కొద్ది నిముషాలు ఉడికించుకోవాలి.
            అంతే బెండకాయ మసాల కూర వేడి వేడిగా సర్వ్ చేయండి.