తెలంగాణ గెలుపు – ఓటములపై బెట్టింగులు..

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతుందని, అన్ని జాతీయ చానళ్ల ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా అంచనా వేశారు.కానీ కూటమి గెలుస్తుందన్న లగడపాటి జోస్యంతో వందల కోట్ల మేర బెట్టింగులు సాగుతున్నాయట.

రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఊహించని రీతిలో పోలింగ్‌ శాతం పెరిగింది.103 నియోజకవర్గాల్లో గతంలో కంటే పోలింగ్‌ శాతం పెరగడంతో,ఆ ఓట్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Janasena Backs TRS?

పోలింగ్‌ శాతం పెరుగుదల తమకంటే తమకే అనుకూలమని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్‌ఎస్‌ చెబుతోంది.

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖ ఓట్లు కాంగ్రెస్‌ కి దక్కుతున్నాయని, మరోవైపు బీజేపీ ఇతర చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉందని,దీంతో టీఆర్‌ఎస్‌ కే లబ్ధి కలగొచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఇక బెట్టింగ్ విషయానికొస్తే కేసీఆర్‌ కి మెజారిటీ 50 వేలు వస్తుందని రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తామనే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారట.

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరైనా రూపాయి పెడితే, 2 రూపాయలు ఇవ్వడానికి బెట్టింగ్‌ వీరులు ఆసక్తి చూపుతున్నారట.ఇక ఎవరు గెలుస్తారో ఓడతారో తెలిసేందుకు ఒక రోజే ఉంది.